Vidarbha: భారీ స్కోరు దిశగా విదర్భ...308/5 1 y ago
ముంబయితో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో విదర్భ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మంగళవారం ప్రారంభమైన మ్యాచ్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 308 పరుగులు సాధించింది. ధ్రువ్ షోరే (74; 109 బంతుల్లో 9x4), డానిష్ మాలెవర్ (79; 157 బంతుల్లో 7x4, 1x6) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. మొదట ధ్రువ్, పార్ట్ రేఖడె (23; 64 బంతుల్లో 2x4) రెండో వికెట్కు 54 పరుగులు జతచేశారు. అనంతరం డానిష్, కరుణ్ నాయర్ (45; 70 బంతుల్లో 6x4) నాలుగో వికెట్కు 78 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోరును 200 దాటించారు. యశ్ రాథోడ్ (47 బ్యాటింగ్), కెప్టెన్ అక్షయ్ వడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబయి బౌలర్లలో శివమ్ దూబే (2/35), షామ్స్ ములాని (2/44), రాక్స్టన్ డయాజ్ (1/26) సఫలమయ్యారు.